Friday, November 22, 2024

TS: కల్వకుర్తి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

ఆమనగల్లు, ఫిబ్రవరి 16 (ప్రభ న్యూస్):కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డి82 కాల్వ అసంపూర్తి పనులు పూర్తి చేయించి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరు అందించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కల్వకుర్తి నియోజకవర్గం లో పలు సమస్యల గురించి ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రస్తావించారు.

కాల్వ నిర్మాణానికి కోట్ల రూపాయలు నిధులు ఖర్చుచేసిన అసంపూర్తి పనుల మూలంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ, ఆమనగల్లు, మాడుగుల మండలాల పరిధిలో 35 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2017 లో డి.82 కాల్వ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. రూ. 178 కోట్లు కాలువ నిర్మాణానికి కేటాయించగా రూ.160 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. కాగా వెళ్లడం మండలం చెరుకూరు వద్ద ఓ రైతు పొలానికి రూ .5 లక్షలు పరివారం అందించకపోవడం వల్ల 2018లో పనులు నిలిపివేశారని ఎమ్మెల్యే నారాయణరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం పట్టింపు లేని ధోరణి వల్ల ఐదేళ్లయిన పనులు పూర్తి కాలేదని, రైతులకు సాగునీరు అందకుండా పోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement