వికారాబాద్ : జిల్లాలోని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఆయనకు కరోనా వైరస్ సోకడం ఇది రెండోసారి. గత ఏడాది చివరిలో మొదటిసారి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కరోనా వైరస్ సోకింది. అప్పట్లో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి కోవిడ్ బారిన పడ్డారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో కొంత అలసటకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన కార్యక్రమాలను మధ్యలోనే ముగించుకొని హైదరాబాద్ వెళ్లిపోయారు. పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తెలియజేశారు. కోవిడ్‌తో బాధపడుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బుధవారం నుంచే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. తాండూరులో జరిగిన భారతరత్న అంబేద్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్న నేతలు.. ప్రజాప్రతినిధులు అంతా కూడా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. నాలుగు రోజుల తరువాత కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేతో కలిసి అంబేద్కర్ జయంతి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రముఖులలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, డిసిసిబి జిల్లా డైరెక్టర్ రవిగౌడ్ ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement