Monday, November 25, 2024

నీరు అందించడంలో విఫలమయిన అధికారులు

యాచారం : యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామానికి మిషన్‌ భగీరథ నీరు రాక గత మూడు రోజుల నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నారని గ్రామ సర్పంచ దూస రమేష్‌ అధికారుల పని తీరుపె మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి తాడిపర్తి గ్రామానికి మిషన్‌ భగీరథ నీరు రావడం లేదని అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన కానీ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని అధికారుల పని తీరుపె ఆయన మండిపడ్డారు. తాడిపర్తి గ్రామానికి వచ్చే మిషన్‌ భగీరథ నీళ్లు ముచ్చర్ల గ్రీడ నుండి వస్తాయని అక్కడి నుండి అధికారులు కందుకూం మండల పరిధిలోని గ్రామాలను పట్టించుకుంటారు కానీ యాచారం మండలానికి సంబందించి కుర్మిద్ద, తండాలలో పాటు తాడిపర్తి గ్రామానికి నీళ్లు అందియక పోగా సర్పంచ్‌లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వేసవి కాలంలో నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామాలలో గ్రామ పంచాయతీ బోర్లు ఉపయోగించుకుంటే కరెంటు బిల్లులను చెల్లించలేక పోతున్నామని పండుగ సందర్భాలలో నీళ్లు సరిగ్గా ఇవ్వలేకపోతున్నామని మోటార్లు చెడిపోయాయని ఈ విధంగా అధికారులు జవాబులు చెప్పి మాట దాట వేస్తున్నారని అన్నారు. కావున ఇప్పటికైన అధికారులు స్పందించి తాడిపర్తి గ్రామానికి ప్రజలకు సరిపడే నీటిని అందించాలని ఆయన కోరారు.
———————————————————————————–

Advertisement

తాజా వార్తలు

Advertisement