Thursday, November 21, 2024

అందరిని మా రాష్ట్ర ప్రజలుగానే భావిస్తాం..

షాద్‌ నగర్‌ : వలస కార్మికులు కూడా మన ఇంటి బిడ్డలే అన్న మనస్సు మన తెలంగాణది. మన ఉద్యమ నేత , సిఎం కేసిఆర్‌ది. కర్షకులు, కార్మికులు, కూలీలు తమ పొట్టికూటి కోసమే ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వారందరని మా తెలంగాణ బిడ్డలుగా గుర్తిస్తామని రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌లు సృష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో 2వ వార్డు అభ్యర్థి చంద్రకళ రాజేంద్రగౌడ్‌, 3వ వార్డు అభ్యర్థి శ్రీనివాస్‌ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడ ఉపాధి కోసం కష్ట పడుతున్న వారు తెలంగాణ అవసరాలను కూడ తీరుస్తున్నారని కొనియడారు. వారిని ఆపదలో వెన్నంటి ఉండి ఆదుకుంటామని సృష్టం చేశారు. వలస కార్మికులను , ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్న తెలంగాణ.. దేశానికి చాటి చెప్పి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కరోనా వైరస్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌ వల్ల వలస కూలీలు యూపి, బీహార్‌ తదితర ఈశాన్య రాష్ట్రాలకు తరలుతుంటే మన రాష్ట్రంలో వలస కూలీలకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కొండంత భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. వారు కూడ మా బిడ్డలే అని అభయమిచ్చారు. కొత్తూరు మున్సిపల్‌ అభివృద్దిలో అందరు పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరికి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని వారు పేర్కోన్నారు. టిఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ ఎంపి మన్నే శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్‌ రాష్ట్ర సభ్యులు రాంబాల్‌ నాయక్‌, ఐసిడిఎస్‌ సంస్థ సభ్యురాలు రాజ్యలక్ష్మీ, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంకాయల నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement