కౌకుంట్ల గ్రామంలో ఆరబిందో ఫార్మా సంస్థ సహకారంతో రూ.90లక్షలతో 4 అదనపు తరగతి గదులు, బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్ల నిర్మాణ పనులను చేపట్టనున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. సంస్థ కౌకుంట్ల గ్రామంలో సామాజిక బాధ్యతగా (సిఎస్ఆర్ నిధులతో) పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి నిర్మించటానికి ముందుకు రావడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. కంపెనీ ప్రతినిధి సదానంద రెడ్డిని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పాఠశాలలోని విద్యార్థుల కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుస్తకాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, డీసీఎంఎస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, ఆర్ జె డి విజయలక్ష్మి, డీఈఓ సుశీందర్ రావు, ఎంపీపీ విజయ లక్ష్మి రమణా రెడ్డి, జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి, సర్పంచ్ గాయత్రి గోపాలకృష్ణ, ఉప సర్పంచ్ ఇనాయత్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital