Friday, November 22, 2024

వరి పంటలను పరిశీలించిన మంత్రి..

ఘట్‌కేసర్‌ : రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటూ సీఎం కేసీఆర్‌ రైతులను అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌ గ్రామంలోని వరి పంటలను మంత్రి మల్లారెడ్డి ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ ఏనుగు కావేరి మచ్ఛేందర్‌రెడ్డిలతో కలసి పరిశీలించారు. ఈసందర్బంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను అన్ని విధాలా ఆదుకొనుటకు వారి సంక్షేమం కోసం కాలేశ్వరం ప్రాజెక్జు నిర్మాణం, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈనెల 16వ తేదీ నుండి వరి ధాన్యం కొనుగోలు కేంధ్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మెన్‌ వెంకటేష్‌, ఫీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి, బోడుప్పల్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, కార్పోరేటర్లు నర్సింహ్మ, పద్మారెడ్డి, సొసైటీ డైరెక్టర్‌ జిల్లాల పోచిరెడ్డి, వార్డు సభ్యులు మల్లేష్‌, రవినాయక్‌, మాజీ ఎంపిటీసీ ఏనుగు లక్ష్మారెడ్డి, టిఆర్‌ఎస్‌ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బైనగారి నాగరాజు, నాయకులు రాంచందర్‌యాదవ్‌, రాజశేఖర్‌ రెడ్డి, బాలకృష్ణయాదవ్‌, దయాకర్‌రెడ్డి, సంతోష్‌యాదవ్‌, బసవరాజ్‌, నవీన్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement