మేడ్చల్ : మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వెజ్…నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజల సౌకర్యార్థం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెజ్..నాన్ వెజ్ మార్కెట్ లను ఏర్పాటు చేయాలని రూ.4:50 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. జూన్ 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్ పాలకవర్గం కలిసికట్టుగా విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. ప్రతీ వార్డులో దోమల బెడద లేకుండా చూడాలని, మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో పరిశుభ్రంగా ఉండేలా చైర్ పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, జిల్లా రైతు సమన్వయ కమిటీ చైర్మన్ ఎన్ నందారెడ్డి, జెడ్పీటీసీ శైలజా విజేందర్ రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమ్మగారి విజేందర్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ బి.భాస్కర్ యాదవ్, మున్సిపల్ పట్టణ తెరాస పార్టీ అధ్యక్షులు చెరువుకొమ్ము శేఖర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు చీర్ల దయానంద్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ మర్రి నరసింహారెడ్డి, కౌన్సిలర్ లు జాకట దేవరాజ్, కౌడే మహేష్ కురుమ, తుడుం గణేష్, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, జంగా హరిక్రిష్ణ యాదవ్, బత్తుల శివకుమార్ యాదవ్, అత్వెళ్ళీ అర్చన సందీప్ గౌడ్, ఆర్ మణికంఠ గౌడ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, నరసింహ స్వామి, కో ఆప్షన్ సభ్యులు గీతా మధుకర్, అకిటి నవీన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్ మల్లికార్జున్ స్వామి, మున్సిపల్ పట్టణ తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బ రామస్వామి ముదిరాజ్, నారెడ్డి రవీందర్ రెడ్డి, పానుగంటి రవీందర్, రాఘవేందర్ గౌడ్, బాలమల్లేష్, సందీప్ గౌడ్, మోనార్క్, పద్మ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement