మేడ్చల్ : మంత్రి మల్లారెడ్డి అధికార దుర్వినియోగం పాల్పడుతున్నాడని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సామాన్య ప్రజా పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు జాకట శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి గ్రామంలో తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ రాష్ట్ర తోలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య అధికార దుర్వినియోగం పాల్పడ్డాడని దళిత బిడ్డను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి భర్తి చేసి నీతిని ధర్మాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చాటుకున్నారని గుర్తు చేశారు. అదే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి అధికార దుర్వినియోగం పాల్పడుతున్నట్లు పలు పత్రికలో వస్తున్నాయని ఆయనను కూడ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి ముఖ్యమంత్రి కేసిఆర్ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ తన నిజాయితిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసిఆర్ దళితునికి ఒక న్యాయం ధనికునికి ఒక న్యాయం ఉండకూడదని వెంటనే మంత్రి బర్తరఫ్ చేసి నిజాయితి పరిపాలనను ప్రజలకు అందించాలని ఆయన కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement