మహిళలకు మద్దతుగా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మహా ధర్నా నిర్వహించనున్నారు. తరుచుగా పెంచుతున్న గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మహాధర్నా నిర్వహించనున్నారు. పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలపై ఈ పెంపు పెనుభారంగా మారింది. ప్రజలకు రోజువారీగా ఆర్థిక కష్టాల పాలు జేస్తున్న సిలిండర్ ధరల పెరుగుదలకు నిరసనగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు మహా ధర్నా నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ వల్ల కట్టెల పోయితో మహిళలకు దూరమైన కన్నీటి కష్టాలు మళ్ళీ మొదలవుతున్నాయని, గ్యాస్ సిలిండర్ ధర పెంపు గుదిబండగా మారటంతో, యావత్ మహిళా లోకం తరపున మంత్రి ఈ ధర్నా చేపట్టనున్నారు. మోడీ జీ సిలిండర్ తీసుకుపో…. కట్టెల పోయి ఇచ్చిపో అనే విన్నూత్న నినాదంతో ఈ నిరసన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement