తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం అందిస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్ పేట్ కార్పొరేషన్ లోని జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉదయం ఆల్ఫాహారం కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ మధ్యాహ్న భోజనం తరహాలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉదయం ఉచిత బ్రేక్ ఫాస్ట్ కు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… పేద, మధ్య తరగతి విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అల్పాహారం అందించాటానికి ముందుకు వచ్చిన సత్యసాయి ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో హాస్టల్, పాఠశాల విద్యార్థులకు దొడ్డు బియ్యం స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నారని తెలిపారు. కేంద్రం 7వ తరగతి వరకే ఇస్తున్నా.. మన రాష్ట్రంలో 10వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామన్నారు. గతంలో 23 లక్షల మంది ఉండగా ఈ విద్యా సంవత్సరంలో 26 లక్షల మంది విద్యార్థులకి మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందిస్తుందన్నారు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే 22 రాష్టాల్లో ఉచిత అల్పాహారం 5 లక్షల మందికి అందిస్తుండగా, తెలంగాణలో 40 వేల మందికి అందిస్తున్నారని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గ లో 10 వేల మందికి తొలిదశలో ప్రారంభించగా, వచ్చే విద్యా సంవత్సరం నుండి మరి కొన్ని పాఠశాలల్లో ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పొందుతూ, బాగా చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, చదివిన పాఠశాలకు, మన రాష్టానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రానున్న పదవ తరగతి పరీక్షల్లో ఇష్టపడి చదివి పాస్ కావాలనీ మంత్రి సబితారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులు, కార్పొరేటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement