Tuesday, September 17, 2024

RR: వికారాబాద్ లో పెద్ద సంఖ్యలో కుక్కలు.. ఆందోళన చెందుతున్న ప్రజలు

వికారాబాద్, ఆగస్టు 3 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలో పలు వార్డుల్లో పెద్ద సంఖ్యలో కుక్కలు తిరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు కుక్కల బారినపడి గాయాల పాలు కాగా మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టని కారణంగా ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

కుక్కలు ఆ మార్గాన వెళ్లే ద్విచక్ర వాహనదారులపై వెంటపడుతూ దాడులు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం గోధుమగుడా వెళ్లే మార్గంలో గల శుభం కన్వెన్షన్ వద్ద ఓ వాహనదారునిపై కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. వాహనదారుడు చాకచక్యంగా తప్పించుకొని రావడంతో బతికి బయటపడ్డాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement