Friday, November 22, 2024

జోరుగా కృతిమ ఇసుక తయారి కేంద్రాలు..

కేశంపేట : మండలంలో ఇసుక మాఫీయా ఆగడాలు రోజు రోజుకు మితిమిరి పోతున్నాయి. రైతులను బెదిరించి వాగుల నుండి మట్టిని తీసి కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారు. మండలంలోని చౌలపల్లి, కేశంపేట గ్రామాల గుండా ప్రవహించే వాగుల నుండి మట్టిని తీసి ఇసుకను తయారు చేసి లారీలలో హైదరాబాద్‌కు తరలించి ఇసుక మాఫీయా లక్షలు రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు తెలిసిన పట్టించుకోక పోవడం శోచనీయం. కేశంపేట మండలం, తలకొండపల్లి మండల శివారుల్లో ఈ తతంగం గత కొన్ని నెలల నుండి యధేచ్చగా సాగుతుంది. చౌలపల్లి గ్రామ శివారులో 10 వరకు కృత్రిమ ఇసుకు తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాగుల నుండి మట్టిని తీస్తూ ఉండడంతో భారీగా గోతులు ఏర్పాడుతున్నాయి. ఇలా అడ్డగోలుగా ఇసుక తీస్తున్నడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తయారు చేసిన ఇసుకను రాత్రి వేళలో లారీల ద్వారా హైదరాబాద్‌ తరలిస్తున్నారు. గ్రామంలో నడుస్తున్న కృతిమ ఇసుక తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని గతంలో గ్రామ యువత, సర్పంచ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ కూడ నిర్వహించారు. ఇత తతంగం నడుస్తున్న కృత్రిమ ఇసుక తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకోకపోవడంపై అధికారులు తీరుపై రైతులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. వాగులలో నుండి ఇసుక తరలిస్తున్నడంతో బోరుబావులు ఎండిపోతాయి. రైతులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన సంబందిత అధికారులు స్పందించి కృత్రిమ ఇసుక తయారీ కేంద్రాలను మూసి వేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement