కోటపల్లి, మార్చి3(ప్రభన్యూస్): కోటపల్లి మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామంలో ఉదయం పల్స్ పోలియో ప్రారంభించారు. చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేస్తున్న కొద్దిసేపటికే వ్యాక్సిన్ పంపిణిలో అంతరాయం ఏర్పడింది. అన్నసాగర్ గ్రామంలో సగానికిపైగా చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీలో ఇబ్బంది ఏర్పడడంతో గ్రామస్తులు ఆశావర్కర్ అమృతను ప్రశ్నించారు.
తమ పై అధికారులు తమకు ఈ గ్రామానికి సంబంధించి బూత్ లేదని చెప్పారు. అందుకుగాను తాను మేడం తో మాట్లాడి 2 బాటిల్స్ తెచ్చుకున్నానని అయినా సరిపోలేదని ఇంకా ఇవ్వుమంటే నువ్వు ఆడిగినదానికంటే ఎక్కువే ఇచ్చాననని పై అధికారి తెలిపారని వివరణ ఇచ్చారు. అనంతరం ఆంధ్రప్రభ విలేకరి అధికారులకు ఫోన్ చేసి మాట్లాడగా కోటపల్లి పి హెచ్ సి సూపర్ వైజర్ కయ్యుమ్ అన్నసాగర్ గ్రామానికి వచ్చి చిన్నారులకు సరిపడా వ్యాక్సిన్ ఇచ్చి వెళ్లారు.
అసలు వివరాల్లోకి వెళితే…. కోటపల్లి పి హెచ్ సి కింద 11 గ్రామాలు ఉండగా కేవలం7 బూతులు మాత్రమే ఏర్పాటు చేశారు. అందులో కోటపల్లి క్లస్టర్ కి 3భూతులు అందులో రెండు కోటపల్లి గ్రామంలో మరొకటి ఇందోల్ ,ఓగులపూర్ గ్రామాలలో ఏర్పాటు చేశారు.ఎన్నారం క్లస్టర్ లో రెండు రెండు ఒకటి ఎన్నారం గ్రామంలో ఒకటి బుగ్గపూర్, కొత్తపల్లి, లింగంపల్లి , అదేవిధంగా రాంపూర్ క్లస్టర్ కింద రెండు అందులో రాంపూర్, కంకణాలపల్లి, కంకణాలపల్లి తాండ, జిన్నారం గ్రామాలలో ఏర్పాటు చేశారు. దీంతో చిన్నచిన్న గ్రామాలలో ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు ఇబంధులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం పల్సపోలియే భూతుల ఏర్పాటులో విఫలమైందని ప్రభుత్వ పనితీరుపై చిన్నారుల తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు.