Monday, November 18, 2024

ఎస్ఎన్డీపీ ప‌నులు పూర్త‌యితే.. వ‌ర‌ద‌ముప్పు ఉండ‌దు : స‌బితా ఇంద్రారెడ్డి

బాలాపూర్ : ఎస్ ఎన్ డి పి పనులు జరుగుతుండడంతో కొన్ని కాలనీల్లో ఈ వర్షాకాలంలో ఇబ్బంది ఉంటుందని పనులు పూర్తయితే భవిష్యత్తులో వరద ముప్పు సమస్యనే ఉండదని విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీధర్ కాలనీ, వెంకట సాయి కాలనీ, ఎస్ ఎన్ డి పి పనులు, వరద ముప్పు ప్రాంతాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేయర్ దుర్గా దిప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డితో కలిసి పర్యటించి కాలనీ వాసులకు ధైర్యం చెప్పారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రెండు రోజులుపాటు కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్ అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

సచివాలయం, జిల్లా, మండలం మున్సిపాలిటీ ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. మీర్పేట్ బడంగ్పేట్ కార్పొరేషన్ లో వరద కాలువ పనులు జరుగుతుండడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ కమిషనర్ అందుబాటులో ఉండి పనిచేయాలని ఆదేశించారు. అధికారులు వేగంగా వరద కాలువ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీధర్ కాలనీలో కొంత భాగం జీహెచ్ఎంసీ పరిధిలో వస్తున్న కారణంగా కాల్వపంలో కొంత ఆలస్యమైన మాట వాస్తవమన్నారు. ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్లు చొరవ తీసుకొని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగేశ్వర్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ సుజాతా నాయక్, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్స్ బొక్క రాజేందర్ రెడ్డి, ఇందివత్ రవినాయక్, గజ్జల రామచంద్రయ్య, చల్ల బాల్ రెడ్డి, సిద్దాల బీరప్ప, జిల్లెల ప్రభాకర్ రెడ్డి, మాదారి రమేష్, సిద్దాల అంజయ్య రాజకుమార్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement