ఇబ్రహీంపట్నం, (ప్రభన్యూస్): ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు నీటి ప్రవాహం రోజురోజుకు ఉధృతం అవుతుంది. ఈ చెరువు 45 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకుతుంది. చెరువు పై ప్రాంతంలో వర్షం కురవడంతో పట్నం పెద్ద చెరువులోకి వరద ప్రభావం కొనసాగుతుంది. దీంతో పట్నం కత్వ పైనుండి మత్తడి ప్రవాహం పెరిగింది. వారం రోజుల నుండి మందకొడిగా సాగుతున్న మత్తడి ప్రవాహం శనివారం రోజున ఉదృతంగా ఔట్ ప్లో కొనసాగుతున్నది. పెద్ద చెరువు నుండి బయటకు పోయే కాలువ పూర్తి విస్తీర్ణంలో నిండి కొనసాగుతుంది. శేరిగూడ శ్రీఇందు కాలేజీ పక్కన ఉన్న కత్వ దగ్గర పైపులు పూర్తి స్థాయిలో నిండి నీరు పారుతుంది.
కల్వర్టు పైపులు చిన్న పరిమాణంలో ఉండడం కారణంగా, నీటి ప్రవాహం ఎక్కువగా వస్తుండడంతో నీరు హైవే రోడ్ పైకి వచ్చి చేరింది. పట్నం పెద్ద చెరువు నుండి బయటకు వెళ్లే నీటి ప్రవాహం ఎక్కువ అయితే మెయిన్ రోడ్డు పై నీటి ప్రవాహం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దీంతో సాగర్ రహదారిపై నీరు పారుతే ఇబ్రహీంపట్నం – హైదరాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఔట్ ప్లో బై పాస్ రోడ్డు పై నుండి కూడా కొనసాగే అవకాశం ఉంది. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తే బాగుంటుgదని ప్రజలు వాపోతున్నారు.