శంషాబాద్ – తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని అన్నారు మంత్రి హారీష్ రావు. మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభీ వాణీదేవి తరుపున ఎన్నికల ప్రచారంలో భాగంగా శంషాబాద్ లో పట్టభద్రుల ఓటర్లతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,బీజేపీ వాళ్లు చాలా బాగా మాట్లాడుతున్నారని, ఐటీఐఆర్ తమవల్లే రాలేదని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. దీనిపై మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించారని, సీఎం కేసీఆర్ అనేకసార్లు ప్రధాని మోడీకి లేఖలు రాశారని గుర్తుచేశారు. ఇక కెసిఆర్ నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల అయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తి చేశామని, ఈ ప్రాజెక్టువల్ల కోటి ఎకరాలు సాగులోకి వచ్చాయని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగు, సాగు నీరు, రవాణా సౌక్యర్యం మెరుగవడంతోపాటు కోతలు లేని విద్యుత్ ఇస్తున్నామని.. దీంతో ఊర్లను విడిచివెళ్లినవారు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ వంటివి ఇస్తామనిచెప్పి ఇవ్వలేదన్నారు. ‘ఏడేండ్లలో బీజేపీ ప్రభుత్వం, స్థానిక బీజేపీ ఎమ్మెల్సీ ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క మంచి పని చెప్పమనండి. ఆరేండ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చారా’ అని ప్రశ్నించారు. అన్నింటిని ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు ధారదత్తం చేస్తున్న బిజెపి కి ఈ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లను అభ్యర్ధించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement