తాండూరు: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పది రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం గమనార్హం. మంగళవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కలిశారు. తాండూరు అభివృద్ధికి సంబంధించి పలు కీలక పనులకు ప్రభుత్వం ఇటీవల జీవోలను జారీ చేసిన విషయం తెలిసిందే. పది రోజుల క్రితం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్భంగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను ప్రస్తావించారు. వెంటనే ఆమోదం తెలపాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో తాండూరుకు పారిశ్రామిక వాడ, పాతతాండూరు రైల్వే వంతెన, వ్యవసాయ మార్కెట్ యార్డుకు భూమి, ఆటోనగర్ కు తాండూరు పట్టణ శివారులో భూమిని కేటాయిస్తూ జీవోలు జారీ అయ్యాయి. జీవోల జారీపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తాండూరుకు సంబంధించిన మరికొన్ని అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్యమంత్రిని విన్నవించారు. ఈ పనులకు సంబంధించి ఒక వినతిప.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.