ప్రజల ప్రయాణ సౌకర్యార్థం, గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం తెరాస ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రులు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంత్రులతో పాటు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి.రంజిత్ రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈరోజు ఉదయం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు రూ.2 కోట్ల 20 లక్షలతో మంజూరైన ఎన్కెపల్లి నుంచి బాకారం రహదారి పనులకు ఎన్కెపల్లి నందు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఉదయం 9 గంటలకు రూ.2 కోట్ల 50 లక్షలతో మంజూరైన చిలుకూరు -మొయినాబాద్ – సురంగల్ రహదారి పనులకు చిలుకూరులో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ,మాజీ జడ్పీటీసీ, మండల నాయకులు, ఎంపీపీ, మాజీ ఎంపీపీ లు, రైతు సమన్వయ సభ్యులు, మహిళ నాయకులు, యువ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది : మంత్రులు ఎర్రబెల్లి, సబితా రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement