Friday, November 22, 2024

Rangareddy: జీవో నెం.111 ఎత్తివేతపై హర్షం

రంగారెడ్డి : జీవో 111 పై నెలకొన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. తాజాగా జీవో ను ఎత్తివేస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఅర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీవో పై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో 84 గ్రామాల పరిధిలో సంబురాలు జరుపుకుంటున్నారు. జీవో ఎత్తి వేయాలని ఏకంగా 20 యేళ్ళుగా పోరాటాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తరువాత మరిచిపోవడం పరిపాటిగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన‌ తరువాత 111 జీవో ఎత్తి వేయాలనే వత్తిడి ఉంది. పలు విడతల్లో సీఎం కేసీఅర్ హామీలు కూడా ఇచ్చారు. అందులో భాగంగా జీవో ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నెల రోజుల్లో కీలక నిర్ణయాలు…
జీవో 111పై నెల రోజుల వ్యవధిలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఅర్ కీలక ప్రకటన చేశారు. త్వరలో జీవో ఎత్తి వేస్తామని ప్రకటించారు. మంగళవారం సీఎం కేసీఅర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీవో ఎత్తి వేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న వెంటనే 84 గ్రామాల పరిధిలో సంబురాలు ప్రారంభ మయ్యాయి. గ్రామ…మండల..నియోజకవర్గ గ్రూపుల్లో జీవోకు సంబంధించి పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.
న్యాయపరమైన చిక్కులను కూడా అధిగ‌మించాలని వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement