నందిగామ : మనస్తాపానికి గురై 16 సం.ల బాలిక ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని భుగ్గోనిగూడా గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు ,గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం భుగ్గోనిగూడా గ్రామానికి చెందిన నర్సింహ దంపతులకు శ్రవణ్ కుమార్, మనిషా అలియాస్ ( అనూష ) ఇద్దరు పిల్లలు వున్నారు. శ్రవణ్ కుమార్ గ్రామ శివారులోని కన్హ శాంతి వనం హార్ట్ ఫుల్ నెస్ సెంటర్లో ఎలెక్ట్రిషన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది తల్లి మృతిచెందినప్పటి నుండి తండ్రి నర్సింహ మద్యానికి బానిసై ప్రతి రోజు మద్యం సేవించి ఇంట్లో ఉన్న ఇద్దరి పిల్లలతో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో రోజు వారి లాగే ఆదివారం ఉదయం మద్యం మత్తులో పిల్లతో గొడవపడి ఇద్దరిని కొట్టడంతో మనస్తాపానికి గురైన బాలిక మనిషా 16 సం.. అన్నయ్య శ్రవణ్ కుమార్ విధులకు వెళ్లిన తరువాత ఇంట్లో గదిలో ఉన్న ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి నర్సింహ మధ్యాహ్నం సమయంలో కొడుకు శ్రవణ్ కుమార్ కు ఫోన్ చేసి చెల్లి ఇంట్లో ఉన్న ప్యాన్ కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలపడంతో వెళ్లి చూడగా చెల్లి శవమై విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు సమాచారాన్ని అందించడంతో సిఐ రామయ్య సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తండ్రి మద్యానికి బానిసై తరచు గొడవలు పడడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు గదిలో ఉన్న సూసైడ్ నోట్ లో వ్రాసి ఉన్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి అన్నయ్య శ్రవణ్ కుమార్ ఫిర్యాదు మేరకు సిఐ రామయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement