Saturday, November 23, 2024

ఫ్రిజ్ షార్క్ సర్క్యూట్ కారణంగా-అగ్ని ప్రమాదం

జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నపురం ఓ ఇంట్లో ఫ్రిజ్ షార్క్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలతో ఆస్తి నష్టం కూడా జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నాపురం విలేజ్ లో ప్రధాన రహదారిలో ఉన్న ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. స్థానికులు చూసి పోలీసులకు అగ్ని మాపక అధికారులకు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ని ఆర్పినరు. ఇంట్లో సుమారు 80 వేల రూపాయిలు వరకు ఆస్తి నష్టం జరిగిందని ఇంటి యజమాని తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement