Tuesday, November 19, 2024

RR: ఉచితం లొల్లి.. బ‌స్సుల కోసం ధర్నా..

శంకర్ పల్లి, ఆగస్టు 8(ప్రభ న్యూస్) : శంకర్ పల్లి మండలం మోకిల పరిధిలోని పలు విల్లా ప్రాజెక్టుల్లో పనిచేసే రోజువారీ కార్మికులకు మహిదీపట్నం డిపో, హైదరాబాద్ టు డిపో బస్సు డ్రైవర్లు, కండక్టర్లు సహకరించడం లేదని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాన రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. మెహదీపట్నం డిపో హైదరాబాద్ టు డిపో డ్రైవర్లు, కండక్టర్లు నానా దుర్భాషలాడుతున్నారని, రిక్వెస్ట్ స్టాపులో కనీసం బస్సు దిగుదామంటే దిగడానికి అవకాశం లేకుండా ఫ్రీగా వస్తారు.. మరీ ఎక్కువ మాట్లాడతారని డ్రైవర్లు, కండక్టర్లు చులకనగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రోజువారీ పనులు చేసుకునే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందుల పాలు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరం డ్రైవర్లను, కండక్టర్లను పలుమార్లు వేడుకున్నామని, అయినా వారు కనకరించడం లేదని, రోడ్డుపై వచ్చి కూర్చుంటే నైనా మా సమస్యలు వారికి అర్థమవుతాయని, రోడ్డుపై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు అభిప్రాయపడ్డారు.

హైదరాబాదు టు డిపో, మెహదీపట్నం డిపో, మేనేజర్లు సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఆలోచన చేసి రోజువారి కార్మికులమైన తమకు న్యాయం చేయాలని వారు కోరారు. వారి సమస్యకు సంఘీభావం తెలిపిన, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, రాజా చంద్ర వెంకటయ్య, కృష్ణ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement