Friday, November 22, 2024

మాజీ ఐఏఎస్ లక్ష్మీకాంతంకు అంతర్జాతీయ వారియర్ ఇన్ ఎడ్యుకేషన్ ఎక్స్ లెన్స్ అవార్డు

మాజీ కలెక్టర్ లక్ష్మికాంతం కు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుండి అంతర్జాతీయ వారియర్ ఇన్ ఎడ్యుకేషన్ ఎక్స్ లెన్స్ అవార్డును శనివారం మాదాపూర్ లోని నాగరత్నం టవర్స్ నందలి వారి కార్యాలయంలో అందచేసినట్లు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ‌ ఫౌండర్, చైర్మన్ సత్యవోలు రాంబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ లో రాంక్ పొంది 9సంవత్సరాలు జువాలజీ డిపార్ట్ మెంట్ లెక్చరర్ గా పనిచేసి తదుపరి విభిన్న ప్రభుత్వ శాఖలలో ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ గా, కృష్ణా జిల్లా కలెక్టర్ గా, తిరుమల తిరుపతి దేవస్థానం లో జేఈఓ గా పని చేసి, పదవీ విరమణ తరువాత వారి జ్ఞానాన్ని వేల మంది సివిల్ సర్వీస్ విద్యార్థులకు బోధ‌న ద్వారా పంచుతున్నారు.

కరోనా సమయంలో కూడా నిరంతరం విద్యా వారియర్ గా ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఆన్ల లైన్ వెబినార్ ద్వారా కాలేజీ విద్యార్థులకు బోధించారు. డిజిటల్ ప్లాట్ ఫారంలో, సీఎస్ బీ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులకు నిరంతరం బోధ‌న‌ చేస్తున్నారు. విద్య ద్వారా వారు సమాజానికి చేసే సేవను గుర్తించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం కు ఈ అవార్డును తమ సంస్ధ ద్వారా అందచేసినట్లు సత్యవోలు రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడ‌బ్ల్యూఆర్ అడ్వైసర్స్ యాదయ్య గౌడ్, కృష్ణాది శేషు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement