Saturday, November 16, 2024

TG | డ్రగ్స్‌ కేసులో విదేశీ మహిళకు 13ఏళ్ల జైలు శిక్ష

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: డ్రగ్స్‌ కేసులో పట్టు-బడిన విదేశీ మహిళకు 13 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి శుక్రవారం సంచలన తీర్పు వెలువరించారు.

2021 జూన్‌లో ఉగాండాకు చెందిన ఓ మహిళ హరారే నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భద్రతా చర్యల్లో భాగంగా డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా ఉగాండాకు చెందిన మహిళ లగేజీ బ్యాగ్‌లో భారీగా హెరాయిన్‌ డ్రగ్స్‌ పట్టుబడ్డాయి.

ఆఫ్రికా దేశమైన ఉగాండాకు చెందిన సదరు మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువ చేసే 3.9 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈక్రమంలో నిందితురాలిపై ఎన్‌డీపీఎస్‌ 1985 యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో దాదాపు మూడున్నరేళ్ల పాటు కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కీలక ఆధారాలు పరిశీలించిన కోర్టు శుక్రవారం నిందితురాలికి 13 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement