మేడ్చల్ : ప్రమాదవశాత్తు ఆటోలో మంటలు చెలరేగాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై ఆటోలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓఆర్ఆర్పై నాంపల్లి నుంచి కీసరకు కట్టెల లోడుతో వెళుతున్న ఆటో అగ్నిప్రమాదానికి గురైంది. ఆటోలో ఇంజన్ వేడి అవుతుందని గమనించిన డ్రైవర్, రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపివేశాడు. ఇంజన్ లో కూలెంట్ చెక్ చేస్తుండగా, అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆటో డ్రైవర్ శ్రీకాంత్, అక్కడే చెట్లకు నీళ్లు పొసే వాటర్ ట్యాంక్ సిబ్బందిని పిలిచాడు. వారి సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ సమాచారం అందుకున్న ఓఆర్ఆర్ ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, ఫైర్ ఇంజన్ సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆటో ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారుల అంచనా వేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement