Friday, November 22, 2024

అందరూ అప్రమత్తంగా ఉండాలి: తీగల అనితా రెడ్డి

కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నందున జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా రెడ్డి కోరారు.
అందరూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని, తరుచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, అందరూ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కోరారు. జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల యువకులకు వాక్సినేషన్ వేస్తున్నారని, అందరూ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ప్రభావం చాలా తక్కువ ఉందని తెలిపారు. రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పట్ల అవసరమైనన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. జ్వర సర్వే వల్ల లక్షణాలున్న వారికి కిట్లను పంపిణీ చేయడం వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి అవకాశముంద‌ని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement