Thursday, November 21, 2024

సామాజిక అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్కరికీ విద్య అవసరం : మంత్రి సబితారెడ్డి

వికారాబాద్ : సామాజిక అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్కరికి విద్య అవసరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల్లో ఆమె మాట్లాడుతూ… వికారాబాద్ జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ భవన నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ స్థలం కేటాయిస్తే నిధులు కేటాయిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న పోలీస్ కేసు విషయంలో జిల్లా ఎస్పీ నుంచి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సునీత రెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, ఆనంద్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, మెంబర్ పటేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement