Monday, November 25, 2024

మొకిల కేంద్రంగా మున్సిపాలిటీ వద్దే వద్దు..

శంకర్పల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామ పరిధిలో జన్వాడ, మొకిల అనుబంధ గ్రామాలను కలుపుకొని మొకిల మున్సిపాలిటీ ఏర్పాటు ఆలోచనకు వ్యతిరేకంగా గౌడిచర్ల వెంకటేష్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని కుల సంఘాలు పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీ, అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున మున్సిపాలిటీ వద్దు, గ్రామపంచాయతీ ముద్దు, అనే నినాదంతో నినాదాలు చేస్తూ భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా జన్వాడ గ్రామ వార్డు సభ్యులు శంకరపల్లి మండల తెరాస యువ నాయకుడు గౌడిచర్ల వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒకవేళ ఏకపక్షంగా మున్సిపాలిటీగా నిర్ణయం తీసుకోదల్చుకుంటే ఎట్టి పరిస్థితులలో అనుమతించేది లేదని భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మా సమస్యను రాష్ట్రస్థాయి నాయకుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ప్రభుత్వ పెద్దలు ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమవుతుందని ఆయన హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement