Saturday, November 16, 2024

RR | పీఆర్సీ విషయంలో సర్కార్ నిర్లక్ష్యం వద్దు.. సదానందం గౌడ్

అమనగల్లు, నవంబర్ 8 (ఆంధ్రప్రభ) : ప్రభుత్వం పీఆర్సీ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఎస్ టి యు టి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ కోరారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలో ఎస్ టి యుటి ఎస్ భవనంలో ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ టి యు టి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…1.7.2023 నుండి రావాల్సిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ఊపిరిగా ఎస్టీయూటీఎస్ గత 77 సంవత్సరాలుగా పోరాడుతుందని తెలిపారు. అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేసే విధంగా హెల్త్ కార్డులను మంజూరు చేయాలని, 317 జీవో బాధిత ఉపాధ్యాయులను స్థానికత ఆధారంగా వారి సొంత జిల్లాలకు కేటాయించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంటును అందిస్తూ జీవో విడుదల చేయడం పట్ల ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సదయ్య, రాష్ట్ర బాధ్యులు కృష్ణారెడ్డి, కరుణాకర్ రెడ్డి ,పోల్ రెడ్డి, రవి, రామ సుబ్బారావు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఇస్తేకార్, సిద్దిపేట్ జిల్లా అధ్యక్షులు భూపాల్ ఏఐఎస్టిఎఫ్ సభ్యులు కసిరెడ్డి పురుషోత్తం రెడ్డి, పరమేశ్వర, ప్రవీణ్ కుమార్, పాండు ,సుధాకర్, బాల నరసింహులు, సుదర్శన్ రెడ్డి, ఆమనగల్ మండల అధ్యక్షులు, కసిరెడ్డి అశోక్ రెడ్డి, నవీన్ కుమార్, సూర్వి, విగ్నేశ్వర, శ్రీనివాస్, తదితరులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement