వికారాబాద్, జనవరి 18 (ప్రభ న్యూస్): ఆంధ్రప్రభ 2024 డైరీని గురువారం నాడు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ ఆయన ఈ డైరీని సీనియర్ జర్నలిస్ట్ ప్యాట రవితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా నిలబడుతున్న ఆంధ్రప్రభ నిష్పక్షపాతంగా వార్తలు రాస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు .రాబోయే రోజుల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంధ్రప్రభ మరింత ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.