కోటపల్లి, ఆగస్టు 21(ప్రభ న్యూస్): శ్రావణమాసం సందర్భంగా కోటపల్లి మండల కేంద్రంలోని శివాలయంలో నిత్యం జరుగుతున్న భజనను నిలిపివేయాలని పోలీస్ స్టేషన్ లో రెండు వందల మంది కంప్లైంట్ చేశారని మంగళవారం రాత్రి ఎస్సై భజనను ఆపాలని, లేకపోతే అరెస్ట్ చేస్తామన్నారు.
దీంతో బుధవారం ఉదయం సమయంలో హిందూ భజన భక్తులందరూ కలిసి పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు. కంప్లైంట్ ఇచ్చినవారి హిందువుల వివరాలు తెలపాలని హిందూ భజన భక్తులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -