Sunday, November 24, 2024

కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న ఎంపిపి

చౌదరిగూడెం : కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని, ప్రతి ఒక్కరు ధైర్యంగా టీకా వేయించుకోవాలని ఎంపిపి సన్వల్లి యాదమ్మ అన్నారు. కొందుర్గు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంపిపి సన్వల్లి యాదమ్మ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమేందుకు అందరు నిబంధనలు పాటించాలని అన్నారు. కరోనా నియంత్రణకు ప్రవేశపెట్టిన వ్యాక్సిన్‌పై ఎవ్వరు ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని ఆమె పేర్కోన్నారు. టీకా వేయించుకున్న తర్వాత కూడ సామాజిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్‌ నిబంధనలు పాటించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement