Sunday, November 24, 2024

TG | అప్పుల బాధ తాళ్ల‌లేక‌ దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

తాండూరు, ఆంధ్రప్రభ : అప్పుల బాధ తాళ్ల‌లేక ఓ దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆదివారం యాలాల మండలం నాగసారం గ్రామానికి చెందిన మాసుల యాదప్ప(42), భార్య మాసుల జ్యోతి(38) పురుగులమందు తాగి మృతి చెందారు. మాసుల యాద‌ప్పకు కొంత భూమి ఉంది. దంపతులు ఇద్దరు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె శ్రీలత(20), కుమారుడు సందీప్‌(12)లు ఉన్నారు. రెండేళ్ల క్రితం అప్పులు చేసి కుమెర్త‌కు వివాహం చేశారు. ఈ క్ర‌మంలో బయటి వ్యక్తుల వద్ద అప్పులు చేశారు.

అప్పుల బాధ, ఆర్థిక భారాలు మోయలేక మనోవేధనకు గురయ్యారు. ఉదయం ఇంట్లో కుమారుడు లేన‌ప్పుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అస్వ‌స్థ‌త‌కు గురైన వారిద్ద‌రిని స్థానికులు తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. విషయం తెలుసుకున్న కుమార్త శ్రీ‌ల‌త‌ యాలాల పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement