Saturday, November 23, 2024

మొక్కలు నాటిన కౌన్సిలర్‌..

మేడ్చల్ : హరిత వనాన్ని పెంపోందించుకోవాలని మున్సిపనల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి పేర్కోన్నారు. మండలంలోని గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పట్టణంలోని 11వ మున్సిపల్‌ కౌన్సిలర్‌ అమరం జైపాల్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా వార్డులో చైర్‌పర్సన్‌తో కలిసి కౌన్సిలర్‌ మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో మొక్కలు నాటి పెంపోందించుకోవాలని పట్టణ ప్రజలకు తెలియజేశారు. కరోనా వ్యాధి నియంత్రణ కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వచ్చిన మాస్క్‌ ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని చైర్‌పర్సన్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే టీచర్లకు సిబ్బందికి పాఠశాలలు మూసివేయడంతో వేతనాలు అందక వారు రోడ్డున పడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మానవత దృక్పథంతో ఒక్కో కుటుంబానికి 25 కిలోల సన్న బియ్యంతో పాటు రూ. 2వేల నగదు అందజేసి వారికి సిఎం అండగా నిలిచారని చైర్‌పర్సన్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి కొనియడారు. మున్సిపల్‌ పట్టణంలోని 11వ మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్‌ అమరం జైపాల్‌రెడ్డి వార్డు అభివృద్దిలో వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నట్లు ఆమె ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ తన జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గోని శుభాకాంక్షలు తెలియజేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్‌ కట్‌ చేసిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి కౌన్సిలర్‌ లు కౌన్సిలర్‌కు తినిపించిన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్‌ మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ డి. ప్రభాకర్‌, దొడ్ల మల్లికార్జున్‌ ముదిరాజ్‌, బేరి బాలరాజు, పెంటయ్య ముదిరాజ్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు ఎస్‌. సురేందర్‌గౌడ్‌, ఎస్‌. జనార్ధన్‌రెడ్డి, సొంగరి సత్తిరెడ్డి, రాము యాదవ్‌, శ్రీహరి, రమేష్‌ చిన్న , దొడ్ల మధు, బండారు రాజు, చంద్రకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement