Tuesday, November 26, 2024

బీసీ బంధులో అవినీతి లీడర్:ఎంపీపీ ఆరోపణ

చేవెళ్ల, (ప్రభన్యూస్): చేవెళ్ల మండలంలో వచ్చిన బీసీ బంధులో మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ కమీషన్లు తీసుకుని ఆయనకు నచ్చిన వారిని లబ్దిదారులుగా ఎంపిక చేశారని, అర్హులైన బీసీలకు అన్యాయం జరిగిందని అధికార పార్టీ బిఆర్ఎస్ కు చెందిన చేవెళ్ల ఎంపీపీ విజయ లక్ష్మి రమణ రెడ్డి ఆరోపించారు.

గురువారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులుగా గ్రామాలలో పేద బీసీ ప్రజలను గుర్తించి బీసీ బందులో లబ్ధిదారులుగా తాను ఎంపిక చేసి జాబితా ఇచ్చామన్నారు. ఐతే తాను ఇచ్చిన లబ్దిదారుల పేర్లను మొత్తం మార్చి తనకు నచ్చిన వారికి బిసి బంధులో పేర్లు వచ్చేలా చేశారని మండిపడ్డారు.

గతంలో వచ్చిన దళిత బందులో కూడా ఇదేవిధంగా చేసి పేద దళితులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా అదే పద్దతి ఆవల.బిస్తున్నారని అన్నారు. బీసీ బందులో కమీషన్లు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే వచ్చేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవినీతిని ప్రశ్నిస్తే తనకు ఏమి తెలియదని ప్రభాకర్ దాటవేస్తున్నారని చెప్పారు.

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీలో మొత్తం అవినీతి జరుగుతుందని వివరించారు. దీనిపై వెంటనే ఎమ్మెల్యే కాలె యాదయ్య స్పందించాలని స్వయంగా అధికార పార్టీ కి చెందిన ఏపీపీ పేర్కొనడం చోశనీయం. ఎమ్మెల్యే యాదయ్య, ప్రభుత్వ యంత్రాంగం స్పందించిక పోతే ప్రభుత్వం కు, మా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement