Saturday, November 23, 2024

కరోనా వైరస్ తో జాగ్రత్త..

చౌదరిగూడెం : కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత సంవత్సరం ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు పర్చడం ప్రజలు సైతం భయాందోళనలకు గురై కోవిడ్‌ నియమాలను కట్టుదిట్టంగా ఆచరించారు. ఈ మధ్య కాలంలో కరోనా భయం వీడిన ప్రజలు విచ్చలవిడిగా తిరుగడం ప్రారంభించారు. మాస్క్‌లు, శానిటైజర్‌ , బౌతిక దూరం ఉండాలన్న నియమాలను పాటించడం మరిచిపోయారు. తిరిగి ఏప్రిల్‌ నెలలో కరోనా మహమ్మారి గత సంవత్సరం కన్న వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కరోనా నివారణకు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దేశంలో ఒక్క రోజే లక్షన్నర , తెలంగాణలో మూడు వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయట పడటంతో ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లాక్‌ డౌన్‌ అమలు పర్చమని ప్రభుత్వం చేతులెత్తెసిన పూర్తి బాధ్యతను ప్రజలపై నెట్టివేసింది. అయితే ప్రజలే స్వచ్చందంగా సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు పెట్టుకుంటు శానిటైజర్‌ను వాడాలని చెబుతుంది. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాలో మాస్క్‌లు పెట్టుకోని వారికి జరిమాన విధించాలని పోలీస్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపించి పోతుంది. కోవిడ్‌ -19 పరీక్షలు చేయించుకోని వారిలో సైతం ఈ వ్యాది సోకింద న్న విషయం అందరికి తెలిసిందే. ఎలాంటి లక్షణాలు కనిపించిన కోవిడ్‌ -19 పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం చెబుతు ఈ మేరకు పరీక్షలను సైతం వేగవంతం చేసింది. గత సంవత్సరం పాజిటివ్‌ వచ్చిన వారిని హోంక్వారంటైన్‌లో పెట్టడంతో పాటు ప్రతి రోజు వైద్యులు పర్యవేక్షించారు. అంతేకాకుండా చుట్టు పక్కల వ్యాధి ప్రభలకుండా మందులు పిచికారి చేశారు. ప్రస్తుతం ఇవన్ని లేవు. ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలి. ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్ద గ్రామంలో కొంత మందికి పాజిటివ్‌ రావడంతో గ్రామ పంచాయతీ స్వచ్చందంగా లాక్‌ డౌన్‌ ప్రకటించింది. కొంత మేర షరతులలో కూడిన సడలింపులను ఇచ్చింది. ప్రభుత్వం ప్రజలపై రుద్ది చేతులు దులుపుకోకుండా గత సంవత్సరం మాదిరి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఏది ఏమైన మరో నెల రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వచ్చే నెలలో శుభకార్యలు ఉ ండడంతో ఎలా జరుగుతుందో అన్న భయందోళనల్లో ప్రజలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement