Tuesday, November 26, 2024

కరోనా వ్యాక్సిన్‌పై అపోహాలు వద్దు..

నందిగామ : కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహాలు వద్దని రంగారెడ్డి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు జిల్లెల్ల వెంకట్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన నందిగామలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సర్పంచ్‌ జిల్లెల్ల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుధ్ద్య సిబ్బంది కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ ప్రజలు ఎవరు కూడ భయబ్రాంతులకు గురి కాకూడదని వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలన్నారు. 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు ధైర్యంగా టీకాను వేయించుకోవాలి అన్నారు. మహమ్మారి కరోనాను తరిమికోట్టేందుకు ప్రజలు ప్రభుత్వం సూచించిన వ్యాక్సిన్‌ను తప్పని సరిగ్గా వేయించుకోని స్వీయ నిర్బంధాన్ని పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వైద్య సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది నాయకులు గ్రామస్థులు, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement