చౌదరిగూడెం : మండల పరిధిలోని ముష్టిపల్లి గ్రామ శివారులోని సత్యదేవ్ గోశాలలో గోశాల పెట్టి 7 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గోశాల నిర్వాహాకులు విద్యా కృష్ణదేవ్ దంపతులు కరోనా నివారణ కోసం యజ్జం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ యజ్ఞంలో పాల్గోన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సంక్షేమం కోసం ప్రజల బాగు కోసం, పూర్వం నుండి సుగంధ ద్రవ్యాలతో కూడిన వనమూలికలతో నెయ్యి, తెనే , పంచామృతంతో యజ్ఞం చేయడం మంచి పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు నాగిల్లా సోమశేఖర్, కె. కె. పాండి, షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, తెరాస రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, పట్లోళ్ల వెంకటేశ్వరరెడ్డి, తెరాస మండల అధ్యక్షులు హఫీజ్, శ్రీధర్ రెడ్డి, కొనేరు నర్సింగ్‌రావు, యాదయ్య , జబ్బార్, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్, ఉమ్మెత్యాల సర్పంచ్ బేగరి నర్సిములు, రాజేందర్‌రెడ్డి, భూపాల్ గౌడ్, రాజు నాయక్, కిషన్ నాయక్, మల్లేష్, నర్సిములు, తదితరులు పాల్గోన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement