Saturday, November 23, 2024

కరోనా తో జాగ్రత్త..

మేడ్చల్‌ : కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్‌ ఎంపిపి అప్పమ్మగారి పద్మజగన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజాబోల్లారం గ్రామ పంచాయతీ సభ్యులు మృతి చెందడం తీవ్రంగా కలచీ వేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పండుగ సందర్భంగా వార్డు సభ్యులు పాల్గొనగా ఆయనకు కరోనా వ్యాధి సోకి మృతి చెందారని తెలిందని ఎంపిపి బాధపడ్డారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నట్లేతే ప్రాణాలను పోగోట్టుకున్న వాళ్లమవుతామని ఆమె అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావాలని ఎంపిపి సూచించారు. అంతేకాకుండా ఎలాంటి సామాహిక శుభకార్యాలలో పాల్గొనకుండా వాయిదా వేసుకోవాలని ఆమె చెప్పారు. అవసరం ఉంటే తప్ప ఎవరు బయటకు రావద్దని..వచ్చినా కూడ మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని ఆమె ప్రజలకు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలల్లో మాస్కులను ధరించి పాల్గోన్నాలని ఎంపిపి పద్మ జగన్‌రెడ్డి వెల్లడించారు. కరోనా బారి నుండి రక్షించుకునేందుకు ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు. మేడ్చల్‌ మండలంలో వ్యాక్సిన్‌ కొరత ఉందని కేవలం మేడ్చల్‌ ప్రభుత్వ కమ్యూనిటి హెల్త్‌ సెంటర్‌లో మాత్రమే ఉందని అందుకే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపిపి పద్మజగన్‌రెడ్డి తెలియజేశారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ తొందరలోనే శ్రీరంగవరం పిహెచ్‌సిలో మేడ్చల్‌ మున్సిపల్‌ పట్టణంలోని పారిశ్రామిక వాడ చెక్‌ పోస్ట్‌ సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి హమీ ఇచ్చినట్లు ఆమె చెప్పారు. కరోనా టీకాలు మేడిసిటి ఆస్పత్రిలో కూడ ఇస్తున్నారని ఆర్థికంగా ఉన్న వారు అక్కడికి వె ళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవాలని వారు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement