మేడ్చల్ : దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాధి నిర్మూలన కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ బిజేపి కౌన్సిలర్ అమరం సరస్వతి మోహాన్‌రెడ్డి పేర్కోన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణంలోని 4వ మున్సిపల్ వార్డులో స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బందిచే కరోనా వ్యాధి నియంత్రణ కోసం సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించినట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను ఇంటి నుండి బయటకు రావద్దని ఒక వేళ అత్యవసరం ఉన్న వారు తప్పకుండా మాస్కు ధరించి బౌతిక దూరాన్ని పాటించాలని కౌన్సిలర్ సరస్వతి మోహాన్‌రెడ్డి వార్డు ప్రజలను కోరారు. వచ్చే నెల నుంచి జూన్ నెలలో దేశ వ్యాప్తంగా గరి భ్ యోజన పథకం ద్వారా ఒక్కోక్కరికి 5 కిలోల ఆహార ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణి చేయడానికి సిద్దంగా ఉందని కౌన్సిలర్ వెల్లడించారు. కరోనా వ్యాధి నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన ప్రజలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారని ఆమె తెలియజేశారు. కరోనా వ్యాధి నిర్మూలన కోసం ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని లేకుంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కౌన్సిలర్ సరస్వతి మోహాన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞాప్తి చేశారు.
కరోనా కట్టడి కోసం అప్రమత్తత..
By sree nivas
- Tags
- Medchal
- Ranga Reddy
- Ranga Reddy District
- Rangareddy Jilla
- Rangareddy Jilla News
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement