Tuesday, November 19, 2024

బంద్‌కు మద్దతు తెలిపిన పలు రాజకీయ పార్టీలు..

ఘట్‌కేసర్ : రైతుల రక్షణతో పాటు 3 రైతు చట్టాల రద్దు కొరకు రైతు సంఘాల పిలుపు మేరకు దేశ వ్యాపిత బంద్‌కు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు రాస్తారోకో నిర్వహించారు. ఘట్‌కేసర్‌ పట్టణంలో బంద్‌కు మద్దతుగా రాజకీయ పార్టీలు కాంగ్రేస్‌, టీడీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ చౌరస్తాలో రోడ్డుపై భైఠాయించి కొద్దిసేపు రస్తారోకో చేశారు. కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్బంగా కాంగ్రేస్‌ మేడ్చల్‌ బీబ్లాక్‌ అధ్యక్షులు వేముల మహేష్‌గౌడ్‌, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వేముల సంజీవగౌడ్‌, సీపీఎం జిల్లా నాయకులు చింతల యాదయ్య, సీపీఐ జిల్లా నాయకులు కల్లూరి జయచంద్ర మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా ఉన్న 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు కేంధ్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే కనీస మద్దతు ధర చట్టం చేయాలని, మండీ వ్యవస్థను కొనసాగించాలని, కార్పోరేట్‌ సంస్థల ప్రవేశం నిషేధించాలని, వ్యాపారంలో జీఎస్టీ విధానాన్ని సులభతరం చేయాలని, 2020 విధ్యుత్‌ చట్టాన్ని రద్దు చేయాలని, రైతు రక్షణ, చిరువ్యాపారుల రక్షణ కొరకు ప్రభుత్వం నిలబడాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఆంధోళనకారులను రోడ్డుపై నుండి తొలగించి అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తరువాత విడుదల చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రేస్‌ జిల్లా నాయకులు నానావత్‌ రూఫ్‌సింగ్‌నాయక్‌, జిల్లా పార్టీ ఉపాధ్యాక్షులు వేముల సత్తయ్యగౌడ్‌, పోచారం మున్సిపల్‌ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, మండల కాంగ్రేస్‌ అధ్యక్షులు కర్రె రాజేష్‌, మహిళా కాంగ్రేస్‌ ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ అధ్యక్షురాలు సగ్గు అనీత, నాయకులు సగ్గు శ్రీనివాస్‌, నానావత్‌ సురేష్‌నాయక్‌, విజయ్‌, అమర్‌ , నర్సింహ్మ, వేముల పరమేష్‌గౌడ్‌, బండిరాళ్ల నవీన్‌, మహేందర్‌, టీడీపీ నాయకులు బొట్టు సూరి, సురేందర్‌ రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి నార్కట్‌పల్లి సబిత, సీపీఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement