మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.7289 కోట్లతో బృహత్తర విద్య ప్రణాళికకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చిలుకానగర్ డివిజన్ లో కోటి రూపాయలతో నిర్మించిన గ్రంథాలయ నూతన భవనాన్ని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి,రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇటీవలి కాలంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఆరు డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయన్నారు. ఉప్పల్ లో డిగ్రీ కళాశాల మంజూరుతో పాటు ఇటీవలి మంత్రి మల్లారెడ్డి విన్నపం మేరకు ముఖ్యమంత్రి మేడ్చల్ కు డిగ్రీ కళాశాల మంజూరు చేసారని సబితారెడ్డి పేర్కొన్నారు.
విద్యకు ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. దేశానికి ఆదాయం ఇస్తున్న రాష్టాల్లో 4వ స్థానంలో ఉన్నా లబ్దిలో మాత్రం చివరి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రం పై కేంద్రం వివక్ష చూపిస్తుందన్నారు. విద్య కోసం చిల్లిగవ్వ కూడా ఇవ్వటం లేదన్నారు. ఏడేళ్లలో దేశ వ్యాప్తంగా 7 ఐఐఎం లు, 7 ఐఐటి లు, 16 ఐఐఐటీ లు, 157 మెడికల్ కలశాలలు, 84 నవోదయ విద్యాలయాలు ఇస్తే రాష్టానికి ఒక్కటి కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసారని సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital