ప్రభ న్యూస్, ప్రతినిధి, మేడ్చల్, ఆగస్ట్ 21: మేడ్చల్ జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపునకు లైసెన్స్ ల జారీకి సంబంధించి లాటరీ నిర్వహణ ప్రక్రియ ద్వారా అభ్యర్థుల ఎంపికను చేపట్టారు. సోమవారం ఉదయం 11గంటలకు నాగోల్ బండ్ల గూడలోని అనంతుల రామిరెడ్డి గార్డెన్ లో ఈ ప్రక్రియను నిర్వహించారు. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ సర్కిల్ లోని దుకాణాల కేటాయింపునకు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ లక్కీ డ్రా తీసి ఎంపిక చేయగా, మల్కాజిగిరి సర్కిల్ లో ను దుకాణాలకు స్పెషల్ ఆఫీసర్ భారతి హాలికేరి లక్కీ డ్రా నిర్వహించారు.
మేడ్చల్ జిల్లా మేడ్చల్ సర్కిల్ లో 114, మల్కాజిగిరి సర్కిల్ లో 88, మొత్తం కలిపి 202 షాపులు న్నాయి. ఇందుకు గాను మొత్తం 14,241 మంది పోటీపడి దరఖాస్తులు దాఖలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ సర్కిల్ ఎక్సైజ్ శాఖ అధికారి విజయ భాస్కర్, మల్కాజిగిరి సర్కిల్ ఎక్సైజ్ శాఖ అధికారి అరుణ్ కుమార్, ఆ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.