Friday, November 22, 2024

నిరుపేదలకు చేయూత సీఎంఅర్ఎఫ్…ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి

బండ్లగూడ మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన ఎం.శ్రీనివాస్ కు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఎల్ఓసీ అందజేశారు.రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన ఎం.శ్రీనివాస్ ఆనారోగ్యంతో బాధపడుతూ.. హైద్రాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తన దృష్టికి తీసుకురాగా.. సీఎం సహాయనిధి నుంచి వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసీ మంజూరు చేయించి వారి కుమారుడు విశాల్ కి చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి.రంజిత్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… సీఎంఅర్ఎఫ్ నిరుపేదలకు చేయూతనిస్తుందన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతో మంది నిరుపేదలను అనారోగ్యం నుండి కాపాడుతుందన్నారు. ఈ సందర్భంగా బాధితుడి కుమారుడు విశాల్ తమకు సీఎం ఆర్ ఎఫ్ ఇప్పించి అండగా నిలుస్తున్న ఎంపీ రంజిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement