మేడ్చల్ : ఆస్పత్రిలో వైద్య ఖర్చుల కింద మంజూరు అయిన రూ.27,500ల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మున్సిపల్ చైర్‌పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుఆ బాధితునికి అందజేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణానికి చెందిన బేగరి అంజయ్యకు ఆరోగ్యం బాగా లేక పోవడం మూలంగా మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని లీలా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేసుకోవడం వల్ల ఆర్థిక ఖర్చులు బాగా పెరిగినట్లు అంజయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన బాధితునికి సిఎం రిలిఫ్ ఫండ్ మంజూరు చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయాన్ని రాష్ట్ర కార్మిక ఉపాధి హమీ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయగా రూ. 27500లు మంజూరు కాగా అట్టి చెక్కును లక్ష్మీ శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా మున్సిపల్ కార్యాలయంలో బాధితునికి అందజేసినట్లు ఆమె తెలిపారు. అడగగానే సిఎం రిలిఫ్ ఫండ్ మంజూరుకి కృషి చేసిన చైర్‌పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డికి బాధితుడు అంజయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్‌లు అమరం జైపాల్‌రెడ్డి, భేరి బాలరాజు, దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, మున్సిపల్ తెరాస పార్టీ అధ్యక్షులు డాక్టర్ సంజీవ్‌గౌడ్, తెరాస పార్టీ నాయకులు ఎస్. సురేందర్‌గౌడ్, సొంగారి జనార్ధన్‌రెడ్డి, ఎం. యాదగిరి గౌడ్, తదితరులు పాల్గోన్నారు.
———————————————————————————-
చెక్కును బాధితునికి అందజేస్తున్న చైర్‌పర్సన్
Advertisement
తాజా వార్తలు
Advertisement