తాండూరు : సమాజంలో బాల బాలికలపై జరుగుతున్న వేధింపులు, అఘాయిత్యాలను నియంత్రించడంలో అందరు బాధ్యతగా మెలగాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దీపా నర్సింలు పేర్కొన్నారు. మున్సిపల్ పరిధి వార్డు నెంబర్ 9లోని అంగన్‌వాడి కేంద్రంలో చై ల్డ్‌లైన్ 1098 ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వైస్ చైర్‌పర్సన్ దీపా నర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చై ల్డ్‌లైన్ ప్రతినిధిలు బాలికలకు 1098 సేవలపై అవగాహన కల్పించారు. అనంతరం దీపా నర్సింహులు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం నేరమన్నారు. పిల్లల అక్రమరవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు. 18ఏండ్ల లోపు బాల బాలికలు ఎవరైనా వేధింపులకు గురైతే, ఏదైనా ఆపదలో ఉంటే 1098 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు. వారిపై జరుగుతున్న అఘాయిత్యాలను, వేధింపులను నియంత్రించేందుకు బాధ్యతగా మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌లైన్ ప్రతినిధి జ్యోతి, అంగన్‌వాడి టీచర్ నవీనా తదితరులు పాల్గొన్నారు.
బాల బాలికలపై వేధింపుల నియంత్రణ..
Advertisement
తాజా వార్తలు
Advertisement