మేడ్చల్ : మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేయడమే మా ముందున్న లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ పట్టణంలోని 23వ మున్సిపల్ వార్డులో స్థానిక కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమతో కలిసి చైర్‌పర్సన్ రూ.10లక్షల నిధులతో సిసి రోడ్డు పనులను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. మున్సిపల్ పట్టణంలోని 23వ వార్డును అన్ని రంగాలలో అభివృద్ది చేయటానికి మంత్రి మల్లారెడ్డి సహాకారంతో ముందుకు సాగుతామని కౌన్సిలర్ మహేష్, చైర్‌పర్సన్ దీపిక నర్సింహారెడ్డిలు వెల్లడించారు. మున్సిపల్ పట్టణ ఎన్నికల ముందు వార్డు ప్రజలకు ఇచ్చిన హమీలను మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపిక రెడ్డి సహాకారంతో నెరవేర్చడానికి కృషి చేస్తానని స్థానిక కౌన్సిలర్ మహేష్ కురుమ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, మేడ్చల్ మాజీ ఉపసర్పంచ్ మర్రి నర్సింహారెడ్డి, శానిటేషన్ ఇన్స్‌ఫెక్టర్ రామచంద్రం, మల్లేష్ కురుమ, పెంజర్ల ఎల్లేష్ యాదవ్, జింకల నర్సింహా ముదిరాజ్, గణేష్, సాయి, నాని, నర్సింహా, పర్వతాలు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement