శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో .. మున్సిపాలిటీ కేంద్రంలో ఉష్ణోగ్ర తలు భారీగా పెరగడంతో ప్రజలు విల విల్లాడుతున్నారు. రోజు వారి వ్యాపారం నిర్వహించుకునే స్ట్జ్రీట్ వెండర్స్ వేడిమి తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గత నాలుగు రోజుల నుండి వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా మెల్లమెల్లగా వాతావరణం బాగా వేడిగా మారిపోతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కరోనా వైరస్.. మరొకవైపు ఉష్ణోగ్రతలు ప్రజలను భాయబ్రాంతాలకు గురి చేస్తున్నాయి. మండల మరియు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని తమ దైనందిన కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా వాతావరణంలో ఉదయం నుండే పూర్తిగా వేడిని విరజిమ్ముతూ.. వాతావరణంలో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ.. ఉండటం కారణంగా రోడ్లపై జనసంచారం తగ్గిపోయింది. రోజు వారి వ్యాపాాంలు రోజు వారి వ్యాపారాలు నిర్వహించుకునే వారు మెల్లగా తగ్గించుకుంటున్నారు. గత సంవ త్సరం పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే భయంకరమైన ఆరోజులు మళ్లీ రాకూడదని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఒక వైపు పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా మరొకవైపు కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమై సాయంత్రం వేళలో తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధ రించి సామాజిక దూరాలను పాటి స్తూ… కార్యక్రమాలు జరుపుకోవాలని కొంతమంది సామాజిక కార్యకర్తలు మండల మరియు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement