తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నాగారం వాగులో కారు కొట్టుకుపోయింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు చెట్టును పట్టుకొని క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. కాగా కారు వరదలో కొట్టుకుపోయిన సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సాయంతో కారుని బయటకు తీశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement