కృత్రిమ అవయవాలు అమర్చుకోవడం ద్వారా వారు రోజు వారి పనులు సాధారణంగా చేసుకోవచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో దివ్యాంగులకు కృత్రిమ చేతుల అమరిక కార్యక్రమం ఏర్పాటు చేసి వందలాది మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అమర్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రోటరీ క్లబ్, మల్లారెడ్డి యూనివర్సిటీ వారు సంయుక్తగా ఎల్ ఎన్ 4 స్వచ్చంద సంస్థ కలిసి దాదాపు 700మంది దివ్యాంగులకు కృత్రిమ చేతులను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. దాదాపు 700 మంది దివ్యాంగులకు ఈ కృత్రిమ చేతులు అమర్చడం జరిగిందన్నారు. ఒక్కొక్క చేయి విలువ దాదాపు 1లక్ష రూపాయలు ఉంటుందన్నారు. రూ.7 కోట్ల వెచ్చించి ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన దివ్యాంగులకు వారి అటెండెర్స్ కు నీళ్లు, భోజనం అన్ని సదుపాయాలు కల్పించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు గౌరిష్, మోహన్, శ్రీదేవి, మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం ఛాన్సెలర్ కల్పనా మల్లారెడ్డి, వైస్ ఛాన్సెలర్ వీఎస్ కే రెడ్డి, డా.శిరోలే, డా.మల్లికార్జున్, హరి ప్రియా, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement